అదే వాన చిత్రం
కానీ
అక్కడ ...
ఏ ఉద్వేగాన్నీ అనుభవించలేని
కాంక్రీట్ గోడల మధ్య ఉంటూ
కుచించుకుపోయిన మనసుని
దూరంగా వానలో తడుస్తున్న
చిన్న గుట్ట ఒక్కటే
పచ్చని చేత్తో నిమురుతుంది.
ఇక్కడ ...
చెట్లతోనే సహజీవనం చేస్తూ
ప్రతి గోడా
నాలుగు చినుకులకే పులకించి
పచ్చటి పాటలు రాస్తుంది.
వాన వెలిసినా
ప్రతి చెట్టూ
ఆ ఙ్ఙాపకాలు పంచుకోడానికి
పోటీ పడుతుంది.
ఈ గాలి సోకుతూనే
గోదారంత విస్తరించిన మనసు
చెట్టు చెట్టునీ పలకరిస్తూ
నిండుగా ప్రవహిస్తుంది.
కానీ
అక్కడ ...
ఏ ఉద్వేగాన్నీ అనుభవించలేని
కాంక్రీట్ గోడల మధ్య ఉంటూ
కుచించుకుపోయిన మనసుని
దూరంగా వానలో తడుస్తున్న
చిన్న గుట్ట ఒక్కటే
పచ్చని చేత్తో నిమురుతుంది.
ఇక్కడ ...
చెట్లతోనే సహజీవనం చేస్తూ
ప్రతి గోడా
నాలుగు చినుకులకే పులకించి
పచ్చటి పాటలు రాస్తుంది.
వాన వెలిసినా
ప్రతి చెట్టూ
ఆ ఙ్ఙాపకాలు పంచుకోడానికి
పోటీ పడుతుంది.
ఈ గాలి సోకుతూనే
గోదారంత విస్తరించిన మనసు
చెట్టు చెట్టునీ పలకరిస్తూ
నిండుగా ప్రవహిస్తుంది.
baagundi
ReplyDeletebest wishes
ఈ గాలి సోకుతూనే
ReplyDeleteగోదారంత విస్తరించిన మనసు...చాలా నచ్చిందండి.
ప్రసూనగారి కవనంలో వాన కురుస్తున్న చప్పుడు వినిపించింది!
ReplyDelete