కొన్ని వాసనలు జీవితంలో ప్రత్యేకమైన ఙ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. వాటిని పునర్నిర్మించే ప్రయత్నం ఎప్పుడూ విఫలమే.
చిన్నప్పుడు ప్రతి వేసవి సెలవులకీ అత్తయ్యల పిల్లలు అందరూ వచ్చేవారు. అందరం కలిసి పెరట్లో నారింజ చెట్టుకిందో, పనస చెట్టు కిందో మట్టి ఇళ్ళు కట్టుకుంటూనో, పూల తోటలు నాటుకుంటూనో ఉండేవాళ్ళం.
ఒకసారి తిరుణాళ్ళలో కొన్న మట్టి పాత్రలు పెట్టుకుని పెరట్లో నారింజచెట్టు కింద ఆ చిన్న పొయ్యి మీదే ఒక మట్టి కుండ పెట్టి, పెరట్లో మేము నాటితే పెరిగిన ఉల్లి కోళ్ళు (స్ప్రింగ్ ఆనియన్ ) ని తరిగి , పులుసు పెట్టాం. పెరట్లో కింద పడిన చిన్న చిన్న ఎండు పుల్లలు అన్నీ పేర్చి ఆ చిన్న పొయ్యి వెలిగించి , ఆ మట్టి పాత్రలో బావిలోంచి తోడి తెచ్చిన నీళ్ళు పోసి , ఉళ్ళికోళ్ళ ముక్కలు వేసి వంట చేస్తూ మేమే ఓ చందమామ కధ నడుపుతున్నంతగా ఆనందించేసాం. ఆ పులుసు మరుగుతున్నంతసేపూ ఆ ప్రాంతమంతా ఎంత మంచి వాసనో చెప్పలేను. ఇప్పటికీ ఆ వాసనెప్పుడూ నన్ను వెంటాడుతూనే ఉంటుంది.
కొన్ని ఙ్ఞాపకాల్ని ఎప్పటికీ పునర్నిర్మించలేమని తెలిసే ఇన్నాళ్ళూ ఎందుకో మరలా ఆ పులుసు వండే ధైర్యం చెయ్యలేకపోయాను. అయితే ఈ మధ్య మాత్రం ఎందుకో ఆ వాసన మరీ మరీ వెంటాడీ ఒక రోజు స్ప్రింగ్ ఆనియన్స్ తెచ్చుకుని చాలా ఉత్సాహంగా చేసాను. మంచి వాసనయితే వచ్చింది కానీ ఏ కోశానా , గుండె పొరల్లో నిక్షిప్తమైపోయిన ఆ వాసనకి సరి కాలేకపోయింది నా వంట.
మరి అప్పటి ఙ్ఞాపకంలో ఉన్న నారింజ చెట్టు, పెరటి ఉల్లికోళ్ళూ, ఆ మట్టి పాత్రలూ, బావి నీళ్ళూ, అన్నిటికీ మించి ఆ స్వచ్చమైన పసితనమూ అన్నీ ఇప్పుడు కొరతే కదా.

avunu :( naku kuda gurthu undi inkaaa
ReplyDeleteమళ్ళీ మన ఊరు వెళ్ళి చిన్నప్పుడు చేసిన అల్లరంతా చెస్తే, మన వయసు సగానికి సగం తగ్గుతుంది :-). పిల్లలకీ కొత్త అల్లర్లు నేర్పచ్చు
ReplyDeletechala bagundi amma pinni babayi inthakanna manchi madharasmruthulu rasthundu amma subhamsthu
ReplyDelete