Tuesday, June 22, 2010

ముఖ్యమైన వాళ్ళకు

కొన్నిసార్లంతే ...

హృదయ స్పందనలోంచి పుట్టిన
భావాల సీతాకోక చిలుకల్ని
గుండెలోనే బంధించడం తప్ప
స్వేచ్చగా వదల్లేం...

దోసిట్లో పట్టుకున్న వాన నీరు
వేళ్ళ సందుల్లోంచి జారిపోయినా
ఆకాశపు కబుర్ల హాయి
అరచేతుల్లో ఇంకా చల్లగా ...

కురిసే వర్షాన్నీ
పెరిగే వెన్నెలనీ
ఆస్వాదించిన సమయం
వృధా అనుకుంటే
బ్రతకడం రానట్టే ...

6 comments:

  1. మీ ఆ భావాల సీతాకోక చిలకల్ని అలా బంధించేయకుండా, ఇలా ఈ బ్లాగ్ ప్రపంచంలో తరచు వదులుతు ఉండండి, మీ రెక్కల సవ్వడికి మీ అభిమానుల కరతాళ ధ్వనుల సవ్వడి కూడా తోడవుతుంది :-).

    ReplyDelete
  2. :-) comments లో కూడా కవిత్వం. :-)

    ReplyDelete
  3. మీరు ఇక్కడే ఉన్నారా? నేను గమనించలేదు. సూపర్.

    ReplyDelete
  4. @SaiKiran కొత్తగా blogging మొదలుపెట్టాను Kiranji :-)

    ReplyDelete
  5. కవిత బావుంది కానీ శీర్షిక ఎందుకలా?

    ReplyDelete