తూర్పు వికసించి
కలల పక్షులు ఎగిరిపోయినా
ఒక్కో ఉదయం...
ఏ పిట్టా వాలని చెట్టులా
నిస్తేజంగా
నా పని కొమ్మ చుట్టూ ఇంతమంది
ఆకుల్లా గల గల లాడుతున్నా
కదిలించే ఒక కిల కిల రావం కోసం
మనసు తపిస్తూ...
అణువణువూ పులకించి పుష్పించాలంటే
నీలిమబ్బు వలపుధార
నాకిప్పుడు కావాలి
ఫ్రసూన గారూ,
ReplyDeleteబ్లాగ్విశ్వానికి స్వాగతం.
మీ మొదటి మూడు పోస్టులూ బావున్నాయి.
మీ బ్లాగు పేరు కూడా చాలా బావుంది.
Wish You all the best!!!
@Somasekhar .. Thank you very much :-)
ReplyDeleteమీ రెక్కల సవ్వడి పుస్తకం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను.
ReplyDelete