Thursday, July 1, 2010

మర్మం

రాలే పువ్వు
రహస్యపు కన్నీరు...

కరిగిపోయే మేఘం
చివరి సూక్తుల చినుకులు...

వలసపోయే కిరణం
చీకటి గుసగుసలు...

అర్థం కానివో
అర్థం లేనివో
నిదుర జారేవేళ
నా గుండె చప్పుళ్ళు.

4 comments:

  1. చాల బాగుంది మీ కవిత

    ReplyDelete
  2. అలతి అలతి పదాల్లో అందమైన భావం..అద్భుతం.

    మీ బ్లాగ్ టెంప్లేట్ చాలా బాగుందండీ..పైన వున్న ఫోటో కూడా అద్భుతంగా వుంది..మీ కవిత లాగే.

    ReplyDelete