Sunday, July 25, 2010

మనసు వాకిట

ఇంతసేపూ

నాకు నేనే వినిపించని
కంప్యూటర్ బాహుబంధాల్లోంచి
వెలుపలకి వచ్చేసరికి

ఎంతసేపుగా
తలుపు తడుతోందో
జడివాన

చెక్కిలి చట్టుక్కున
ముద్దాడుతూ
దూసుకొచ్చింది.

ఇక మనసంతా సందడి.

7 comments:

  1. excellent excellent chala chaala bavundi .....
    :-)))

    ReplyDelete
  2. చాలా బావుందండీ...
    అంత సేపూ మీరు కంప్యూటర్ తో ఎంత కష్టపడ్డారో తెలీదు కానీ,
    సరైన సమయం లో దాని బారి నుండి బైట పడడం,
    ప్రకృతి ఒడిలో చేరడం,
    ఆ వాన చినుకులకి పులకించడం,
    అలా స్పందిచడం,
    ఇలా మాతో పంచుకోవడం
    మాకు కడు అనందదాయకం...:-)

    ReplyDelete
  3. చాలా బాగుంది. నేను చాలా ఆలస్యంగా మీ బ్లాగ్ చూశాను. ఇలాంటి మరిన్ని చూస్తానన్న ఆశతో ఇక నుంచి ఎదురు చూస్తుంటా.

    అఫ్సర్

    ReplyDelete
  4. నేను మీ బ్లాగ్ ఇప్పుడే చూసా. బాగున్నాయి మీ వాన సందళ్ళు.

    ReplyDelete
  5. చాలా థాంక్స్ అండీ భానూ గారు. :-)

    ReplyDelete