Monday, September 6, 2010

భీష్మ ...


నిన్న మధ్యాహ్నం ఎమీ తోచక ఛానెల్స్ మారుస్తుంటే, వెంకటేశ్వరా భక్తి ఛానల్ లో, పాత సినిమా భీష్మ వచ్చింది.   

ఒక పాత పౌరాణిక సినిమా చూసి చాలా కాలం అయిందని చూస్తే అప్పుడు గుర్తొచ్చింది.

చాలా చిన్నప్పుడు ఈ సినిమాకి మేమంతా మా బామ్మగారితో కలిసి వెళ్ళాం. అప్పట్లో ఈ సినిమా చూడటానికి ముందే మా బామ్మగారి ఒళ్ళో కూర్చుని చాలా పురాణగాధలు వినేశాం. భీష్ముడు, అంబ, అంబిక, అంబాలిక ల కధలు కూడా. సినిమాలో బామ్మగారి పక్కన కూర్చుని ఇంతకు ముందు ఆవిడ ద్వారా విన్న కధే తెరపైన చూడటంలో అదో ఆనందం.

ఈ సినిమాలో "మహా దేవ శంభో .." అన్న పాట చిన్నప్పుడు పాడుకుంటూ ఉండేదాన్ని. నిన్న మళ్ళా అంబ శివుడిని గూర్చి తప్పసు చేసే ఘట్టం, ఈ పాటా చూస్తే కళ్ళ ముందు ఛానెల్ లో సాగుతున్న సినిమా కన్నా ఎప్పుడో ఇరవయ్యేళ్ళకు పూర్వమే బామ్మగారి ఒళ్ళో కూచుని ఈ కధ విన్న అనుభూతే మళ్ళా గుర్తొచ్చింది.

ఎంతయినా బాల్యం మొత్తం లో ఇలా తాతయ్యగారితోనూ, బామ్మగారితోను గడిపిన కాలం అమృతతుల్యం కదూ . 
 
నిన్న సినిమా పూర్తవుతూనే మహాదేవ శంభో పాట డౌన్లోడ్ చేసేసాను. ట్యూన్ కోసం కన్నా ఇది బామ్మగారితో కలిసి చూసిన పౌరాణిక సినిమాలోని పాట కదా అని వినడంలోనే ఎక్కువ ఆనందం కలుగుతోంది నాకు.   

1 comment:

  1. విజయా వారి మాయాబజారును రంగులద్ది తెలుగునాట మరోసారి రిలీజు చేశారు. ఇది ఒక ప్రయోగం. మాయాబజారు వంటి సినిమా దిగ్గజం కనుక దీన్ని గురించి రాయడం వాణిజ్యపరంగా ప్రచారం కల్పించడం అని నేను అనుకోవడం లేదు. Pl click on the below link if you are interested.
    http://bhandarusrinivasarao.blogspot.com/2010/02/blog-post_11.html

    -భండారు శ్రీనివాసరావు

    ReplyDelete