చినుకై రాలిన మేఘాన్ని
ఆకాశం తిరిగి పొందినట్టు
కోల్పోయిన ఆత్మీయుల్ని
మనిషి పొందగలిగితే
ఎంత బాగుండును !!
మరచిపోయిన దారుల్లో
నది తిరిగి ప్రవహించినట్టు
గతకాలపు గుంటలోకి
వర్తమానాన్ని మళ్ళించగలిగితే
ఎంత బాగుండును !!
ఈ తీరం
ఇష్టంగా చేరిన గమ్యమే అయినా
అసంతృప్తితో జారిపోతున్న
ప్రతి క్షణమూ
సిగ్గుపడేలా
బాల్యాన్ని చూపించనూ !
ప్రసూన గారూ;
ReplyDeleteఈ కవిత బాగుందండీ..నిజంగానే దేన్నయినా వెనక్కి మళ్లించే శక్తి మనిషికి వుంటే అది బ్రహ్మానందమూ కావచ్చు, తీవ్ర విషాదమూ కావచ్చు. చెప్పలేం!
Super @ Prasoona gaaru.
ReplyDeleteబాగుందండీ! excellent!
ReplyDeletechala bagundi.......gnapakalanu nemaru vesukunnappudu manam santhosha padda kshanalanu gurthu chesukonte kallu chemma gillu thayi,bada padda samayalani gurthu chesukonte navvukontamu...ade jeevitam..
ReplyDeleteమీరు నిజంగానే మధురమైన బాల్యాన్ని చూపించారు....
ReplyDeleteఈ తీరం
ReplyDeleteఇష్టంగా చేరిన గమ్యమే అయినా
అసంతృప్తితో జారిపోతున్న
ప్రతి క్షణమూ
సిగ్గుపడేలా
బాల్యాన్ని చూపించనూ !
చాల బాగుంది , ఇప్పుడు మీ టెంప్లేట్ మీ అబిరుచికి తగినట్టుగా ఉంది చూస్తుంటే చదువు తుంటే ఆహ్లాదంగా ఉంది
మీ బ్లాగ్ ఇప్పుడే చూస్తున్నానండీ...బాగుంది. బొమ్మలు,కవితలు,template,డుంబో...అన్నీ బాగున్నాయి...:)
ReplyDeleteప్రసూన గారూ,
ReplyDeleteమీ కవితలు నాకు కొన్ని నచ్చేయి. వాటిని అనువాదంచెయ్యడానికి మీ అనుమతి ఇవ్వగలరా?
అభివాదములతో