Tuesday, January 10, 2012

బోసి నవ్వు

కాలం నది ఒడ్డున
నిన్నటి దాకా నత్తల్లా నిలబడి
నన్ను వెక్కిరించిన ఋతువులన్నీ
నా ఒడిలో ఆడుతున్న వసంతాన్ని చూసి
అసూయతో పరుగెట్టి పోతున్నాయ్.


ఎన్నేళ్ళు ధ్యానించినా చేరలేని
అనంతానందపు శిఖరాగ్రాన్ని
నీ బోసినవ్వు రెక్కలమీద
క్షణంలో చేరగలగడం
ఎంత చిత్రం!


నీ సమక్షంలో గడిచే
ప్రతీ క్షణంలోని ముగ్థత్వాన్నీ
కవితలో పొట్లాం కట్టే విఫల ప్రయత్నాలు
సూర్యుడు ఆకాశాన్ని వెలిగించినంతమేరా
మూతి ముడుచుకున్న తెల్లకాగితాలు

5 comments:

  1. మీ కవితలన్నీ చదివాను. ఏవో లోకాల్లోకి తీసుకుపోతున్నాయి.. తరచుగా రాస్తుండండి...ధన్యవాదాలు

    ReplyDelete
  2. Excellent.ఇదొక్కటే కాదు .మీ కవితలన్నీచదివాను. చాలా బావున్నాయి.

    ReplyDelete
  3. మీ భావజాలం దాన్ని వ్యక్తపరిచిన విధానం రెండూ చాలా బాగున్నాయి. రాస్తూ ఉండండి ప్రసన్న గారూ!

    ReplyDelete