Thursday, July 8, 2010

ఆక్టోపస్ బాబా ??

కొన్ని రోజులుగా వార్తల్లో దర్శనమిస్తున్న ఆక్టోపస్ బాబా ని చూశారా ?

ఇంగ్లాండ్ లో పుట్టిన ఈ ఆక్టోపస్ వయసు రెండేళ్ళు. ప్రస్థుతం జెర్మనీ లో సీ లైఫ్ ఎక్వేరియం లో రాచమర్యాదలు అందుకుంటోంది.ఇంతవరకు ఆరు జెర్మన్ ఇంటర్నేషనల్ ఫుట్ బాల్ ఆటల్లో, ముందుగానే ఎవరు గెలుస్తారు అనే జోస్యం చెప్పేసిందిట.ఆక్టోపస్ బాబా చేత ఇది చెప్పించడం కోసం జెర్మన్లు రెండు బాక్సులు అది ఉన్న ఎక్వేరియం లో పెడుతున్నారు. ఒక దాంట్లో జర్మన్ జాతీయ జెండా, మరొక దాంట్లో జెర్మన్ తో ఆడుతున్న దేశపు జెండా పెడుతున్నారు. ఈ బాబా కొంత సమయం తీసుకుని , రెండింట్లో ఒక బాక్సు మీద కూచుంటోందిట. ఆటలో ఖచ్చితంగా ఆక్టోపస్ ఏ దేశం పేరున్న బాక్సు మీద కూచుందో ఆ దేశమే గెలుస్తోంది.ఎంత చిత్రం గా ఉంది కదూ …

ఎప్పుడూ గోల గోల గా విసుగెత్తించే వార్తా ఛానళ్ళలో ఈ ఆక్టోపస్ వార్త వింటుంటే, ఎడారిలో చిరుజల్లు కురిసినట్టు లేదూ ?నాకయితే భలే సంబరం గా, ముచ్చటగా అనిపించింది ఈ ఆక్టోపస్ ని చూస్తే. చిన్నప్పుడు తతయ్యగారి దగ్గర కూచుని కథలు చెప్పించుకున్న రోజులు, చందమామ కథలు చదువుకున్న రోజులు వెనక్కి వచ్చినట్టు అనిపిస్తోంది. ఒక్కసారిగా ఆ అందమైన రోజుల్లోకి తిరిగి వెళ్ళిపోయిన అనుభూతి కలుగుతోంది ఒక రెండు మూడు రోజులుగా ఇంట్లో ఈ ఆక్టోపస్ గురించి మాట్లాడుకుంటుంటే.ఎన్ని కథలు అల్లుకొవచ్చు కదూ ? ఒక మంచి చందమామ కథగా మలచుకోవచ్చు.ఇంట్లో అందరం కలిసి మాట్లాడుకునేది కాసేపే అయినా, ఇలాటి ముచ్చటైన విషయాల కోసం వెచ్చించేది గుప్పెడు క్షణాలే అయినా మనసుకి instant energy ఇచ్చే ఇలాంటి విషయాలని మూటగట్టుకునే ఆ గుప్పెడు క్షణాల్లో ఎంత జీవం !!ఈ వార్తలో నిజమున్నా లేకున్నా, వినడానికి మాత్రం మంచి కబురు కదూ...

5 comments:

 1. హీ హీ ! మీ బ్లాగు పేరు బావుంది. భలే గా !
  ఆక్టోపస్ గురించి మీ ఆలోచనలు కూడా భలేగా ఉన్నాయి.
  మీ టపా చదివాక టాం ఎండ్ జెర్రీ లో ఆక్టోపస్ గుర్తొచ్చింది.

  ReplyDelete
 2. మనదేశ ఎన్నికలప్పుడు దాన్ని భారద్దేశానికి తీసుకురావాలి,ఎన్డీయే గెలుస్తుందా లేదా కాంగ్రెస్స్ గెలుస్తుందో తెలుసుకోవడానికి? అయినా మనకు దాంతో పనేముందిలే మన ఈవీఎమ్ములే చెబుతాయి కదా కాంగ్రెస్సే గెలుస్తుందని. :)

  ReplyDelete
 3. బాగా ఉన్న్నది మీ టప. ఈ విషయం కాని టీవీ 9 వాడికి తెలిసిందో ఒక వారం రోజుల పాటు ఎవ్వరిని నిద్ర పోకుండా ఒక్టపుస్ ఎక్కడ పట్టింది ? , ఎలా పెరిగింది ? అస్సాలీ పురాణం ఏంటి బ్రేఅక్ తరువాత అంటూ చంపేస్తాడు. దీనికి తోడుకుగా వీటికి పోటిగ వచ్చిన మరో పది చానళ్ళు బ్రేకింగ్ న్యూస్ అంటూ యెడ పెడ మిగిలిన సముద్రపు జీవులన్నిటి మీద ప్రోగ్రామ్స్ చేసి జనాలకి విసుగు వచేవరకు విడిచిపెట్టా కుండ నిరంతర వార్తలు జనాల నెత్తి మీద వదిలేస్తారన్నమాట.

  ReplyDelete
 4. avunamDi nenu chuSanu, asalu idi antha namachu anTaraaa?

  ReplyDelete